ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మండుటెండల్లోనూ మంచుదుప్పటి.. ఆహ్లాదకరంగా వాతావరణం

Snow in Simhachalam: దేశంలో ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి... చెట్టుచేమ వాడిపోయి నేలరాలుతున్నాయి... వాగువంకలు బీటలు వారుతున్నాయి... కానీ ఆ ప్రాంతంలో మాత్రం చల్లటి మంచు వాతావరణం అందరికీ హాయినిస్తోంది... అక్కడి మంచు కొండలు చూపరులను ఆకర్శిస్తున్నాయి... ఇదంతా ఎక్కడో కశ్మీరో... విదేశాల్లోని మరో ప్రాంతమో అనుకుంటే పొరపాటే... ఈ మంచు దుప్పటి కనిపించేది మన రాష్ట్రంలోనే... ఎక్కడంటే..?

Snow in Simhachalam
మండుటెండల్లోనూ మంచుదుప్పటి

By

Published : May 3, 2022, 9:37 AM IST

Snow in Simhachalam: ఓ వైపు భానుడు భగభగ మండుతున్నాడు.. మనషుల నుంచి జంతువుల వరకు అందరూ దాహార్తి తీరక అల్లాడుతున్నారు.. చెట్టు చేమ ఎండలో మాడిపోతున్నాయి.. మనుషులు సైతం మండుటెండల్లో వడదెబ్బకు గురవుతున్నారు.. కానీ సింహాచలంలో మాత్రం వాతావరణం మరోలా ఉంది... ఆ ప్రాంతమంతా చలికాలాన్ని తలపిస్తోంది.. అక్కడి కొండలు మేఘాల్లో తేలుతూ.. మంచుదుప్పటి కప్పుకొని సేద తీరుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్రకృతి అందాలు అందరి చూపును కట్టిపడేస్తున్నాయి. చందనోత్సవ వేళ ఈ వాతావరణం భక్తులను ఆహ్లాదపరుస్తోంది.

ఇదీ చదవండి: Teachers Holidays: 'ఈ నెల 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలి'

ABOUT THE AUTHOR

...view details