ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్మార్ట్​ సిటీ లక్ష్యాలను చేరుకున్న నగరాలకు అవార్డులు - విశాఖలో స్మార్ట్ సిటీ అవార్డులు

ఆకర్షణీయ నగరాల అంశంపై విశాఖలో రెండు రోజుల సదస్సు జరుగుతోంది. ప్రజల కోసం నగరాల నిర్మాణం అనే అంశంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీల దిశగా వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డుల ప్రదానం చేస్తున్నారు. రికగ్నేషన్ ఆఫ్ పర్ఫామెన్స్ అంశంలో అమరావతి, విశాఖకు అవార్డులు వరించాయి.

smart city awards ceremony in visakha
smart city awards ceremony in visakha

By

Published : Jan 24, 2020, 1:09 PM IST

Updated : Jan 24, 2020, 3:10 PM IST

అమరావతి, విశాఖకు స్మార్ట్ సిటీ అవార్డులు

స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలు చేరుకోవడంలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన నగరాలుగా అమరావతి, విశాఖ నగరాలు అవార్డులు సాధించాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖలో 'ఆకర్షణీయ నగరాల' అంశంపై మూడో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రజల కోసం నగరాల నిర్మాణం అనే అంశంపై రెంజు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమయ్యింది. స్మార్ట్ సిటీల దిశగా వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్​ అంశంలో అమరావతికి, ముడసర్లోవలో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుపై విశాఖకు అవార్డులు వచ్చాయి. అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్ నగరం 'సిటీ' అవార్డును గెలుచుకుంది.

ప్రముఖ నగరాలకూ అవార్డులు

అవార్డులు పొందిన స్మార్ట్​ సిటీ నగరాలివే..!

పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం ఇలా వివిధ రంగాల్లో తమిళనాడు రాష్ట్రానికి అవార్డు దక్కింది. మిగిలిన విభాగాల్లోనూ ప్రముఖ నగరాలు అవార్డులను కైవసం చేసుకున్నాయి.

ఇదీ చూడండి:

ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్​ పర్యటన

Last Updated : Jan 24, 2020, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details