సీలేరులో భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు - Slight earthquakes in Visakhapatnam
11:31 November 21
మన్యంలో భూకంపం
విశాఖ మన్యం సీలేరులో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు.. బయటికి పరుగులు తీశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సీలేరులో భూమి కంపించింది. అదే సమయంలో పెద్దగా శబ్దం రావడం.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఏం జరిగిందా అని అనుకునే లోపే.. ప్రకంపనలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్ఈ , జెన్కో అపార్ట్మెంట్ల వద్ద ప్రకంపనల శబ్దాలు పెద్దగా వినిపించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సీలేరులో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.