ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వీధి బాలల కోసం జీవన నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటు - విశాఖలో వీధి బాలల కోసం శిక్షణ శిబిరం వార్తలు

విశాఖలో వీధి బాలల కోసం జీవన నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటైంది. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసి వారి అభివృద్ధికి బాటలు వేయడమే ఉద్దేశంగా.. పవర్ స్వచ్ఛంద సంస్థ, కెమిస్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు.

skill development program for street children in vizag
వీధి బాలల కోసం జీవన నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటు

By

Published : Jun 17, 2020, 10:44 PM IST

విశాఖలో వీధి బాలల కోసం జీవన నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటైంది. కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వంతెన క్రింద ఉంటున్న పేదల పిల్లల అభివృద్ధికి.. పవర్ స్వచ్ఛంద సంస్థ, విశాఖ కెమిస్ట్స్ సొసైటీ ప్రతినిథులు కృషిచేస్తున్నారు. వారి నేతృత్వంలో నేడు జీవన నైపుణ్య శిబిరం ఏర్పాటైంది. దీనిపై పవర్ సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ.. పిల్లల్లో సృజనను వెలికితీయడమే శిబిరం ఉద్దేశమన్నారు.

2 నెలలపాటు వివిధ అంశాల్లో నిపుణులైన వారిచేత బాలలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వారిలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యా వికాసం కలిగి, సమాజం పట్ల సానుకూల దృక్పథం అలవడుతుందన్నారు. అనంతరం పిల్లలకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details