విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల సంక్షేమ సంఘం నిరసన చేసింది. ఈ నిరసనలో బాధిత గ్రామాల ప్రజలు న్యాయం చేయాలని ప్లకార్డుల ప్రదర్శించి.. నినాదాలు చేశారు. బాధితుల నిరసనకు సంఘీభావం ప్రకటించిన సీపీఎం నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత గ్యాస్ ప్రభావంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని.. మరికొంత మంది చనిపోయారని సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు నెలలు గడిచినా అందని సాయం..ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితుల ఆందోళన - LG polymers victims agitation latest news
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీపీఎం మద్దతు తెలిపింది. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం బాధిత గ్రామాల ప్రజలను పట్టించుకోలేదని.. వారికీ తక్షణ ఆర్థిక సహాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. బాధితుల అందర్ని ఆదుకునే వరకు వారి తరుపున పోరాడతామని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని డిమాండ్ చేశారు. ఆరునెలలు గడిచినా న్యాయం చేయలేదని.. ప్రభుత్వం తరుపు అందరు ఉత్త మాటలు చెప్పారని సీపీఎం రాష్ట్ర నాయకులు నరసింగరావు విమర్శించారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండీ... వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం