విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. స్టైరిన్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందన్నారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్న మంత్రి... నివేదిక వచ్చే వరకు ప్రజలు గ్రామాలకు రావద్దని కోరారు.
స్టైరిన్ ట్యాంక్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ జీఎం మోహన్రావు చెప్పారు. ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయ్యిందని అన్నారు. దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని స్పష్టం చేశారు.