ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాల్తేరు క్లబ్ ఫిర్యాదులపై 'సిట్' విచారణ - SIT chairperson vijaya kumar

వాల్తేరు క్లబ్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విశాఖ భూకుంభకోణంపై ఏర్పాటైన సిట్ విచారణ జరిపింది. హక్కుదారులు, క్లబ్ లీజుదారులు, రెవెన్యూ యంత్రాంగం నుంచి వివరాలను సేకరించారు. ఈనెల 20న పూర్తి వివరాలతో రావాల్సిందిగా ఇరువర్గాలకు సిట్ చీఫ్ విజయ్ కుమార్ కోరారు.

SIT chairperson Vijaya Kumar
హెడ్లైన్ వాల్తేరు క్లబ్ ఫిర్యాదులపై సిట్ విచారణ

By

Published : Jan 12, 2021, 4:42 PM IST

వాల్తేరు క్లబ్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విశాఖ సిట్ విచారణ జరిపింది. తిరిగి ఈనెల 20న మిగిలిన వివరాలతో రావాల్సిందిగా ఇరువర్గాల న్యాయవాదులను కొరింది. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న వాల్తేర్ క్లబ్ దాదాపు 30 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి ఉన్నట్టు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. 99 ఏళ్ళ లీజులో ఉన్న ఈ భూమికి సంబంధించిన హక్కుదార్లు, క్లబ్ లీజుదార్లు, విశాఖ రెవెన్యూ యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్న సిట్ చీఫ్ డాక్టర్ విజయ్ కుమార్ అందరిని పిలిపించి మాట్లాడారు. మరికొంత సమయం కావాలని కొరడంతో ఈనెల 20 వరకు గడువు ఇచ్చినట్టు డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు.

క్లబ్ తరపున 1900 లో ఒరిజినల్ లీజు పత్రం ఇవ్వాలని కోరామని, చెట్టి కుటుంబ వారసులు కూడా వచ్చారని విజయ్ కుమార్ వివరించారు. దీనిపై కలెక్టర్ కూడా నివేదిక కూడా ఇచ్చారని తెలిపారు. వాల్తేరు క్లబ్ తరపు లాయర్లు బృందం మాట్లాడుతూ.. తమ తరుఫున వాదనలు వినిపించేందుకు గడువు కోరామన్నారు. విజయనగరానికి చెందిన చెట్టి వారసుల ప్రతినిధి రాజగోపాల్ మాట్లాడుతూ మొత్తం 31 ఎకరాలు భూమిని తమ పూర్వీకులు లీజుకి ఇచ్చారన్నారు. ఈ భూములుపై 1999లో గడువు ముగిసిందని, 2005 నుంచి హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

ABOUT THE AUTHOR

...view details