ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Singing Hanuman Chalisa for 24 hours at visakhapatnam : 24 గంటల పాటు.. నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం - అంబికాబాగ్ శ్రీరామాలయం

విశాఖపట్నం అంబికా బాగ్ శ్రీరామాలయంలో 24 గంటలపాటు ఏకధాటిగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి మొదలైన పారాయణం.. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు కొనసాగిస్తున్నారు.

సంగీత విద్వాంసులు డాక్టర్ తాడేపల్లి లోకనాధ శర్మ
సంగీత విద్వాంసులు డాక్టర్ తాడేపల్లి లోకనాధ శర్మ

By

Published : Nov 27, 2021, 9:55 PM IST

విశాఖపట్నం అంబికా బాగ్ శ్రీరామాలయంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ తాడేపల్లి లోకనాధ శర్మ హనుమాన్ చాలీసా గానం పారాయణం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 24 గంటలపాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసాను ఆలపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ఈ ధార్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

ఈరోజు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి రేపు (ఆదివారం) ఉదయం ఆరు గంటల వరకు ఈ నిరంతర పారాయణ కొనసాగిస్తున్నారు. ఇందులో సుందరకాండ పారాయణం కూడా చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీరామాలయ మాడ వీధుల్లో శోభా యాత్ర నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ, 108 వడల మాల సమర్పించారు.

ఇదీ చదవండి:ప్రపంచానికి కరోనా 'కొత్త' ముప్పు.. ఆంక్షల చట్రంలోకి దేశాలు!

ABOUT THE AUTHOR

...view details