ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులకు మద్దతుగా గాయకుడు దేవిశ్రీ 'ఆట పాట' - దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా విశాఖలో గాయకుడు దేవిశ్రీ ఆటపాట

కోట్లాది ప్రజల కడుపు నింపుతున్న రైతులకు సంఘీభావంగా గాయకుడు దేవిశ్రీ విశాఖలో 'ఆట-పాట' నిర్వహించారు. మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. రైతులకు సంఘీభావం తెలుపుతూ తన గళాన్ని వినిపించారు.

aatapata in visakha
ఆటపాట నిర్వహించిన గాయకుడు దేవిశ్రీ

By

Published : Dec 9, 2020, 7:26 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి బాసటగా.. 'భారత భాగ్య విధాత ఓ రైతన్న' అంటూ గాయకుడు దేవిశ్రీ విశాఖలో 'ఆట పాట' నిర్వహించారు. మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. 'అన్నం పెట్టే రైతన్న కడుపుకు సున్నం రాస్తున్నారు ఎందుకు' అని పాడుతూ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

సిరులు పండించి కోట్లాది ప్రజల కడుపులు నింపుతున్న రైతన్నకు.. దమన నీతితో బదులు పలుకుతారా అని దేవిశ్రీ ప్రశ్నించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా ప్రజా కళాకారులు గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details