ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింహాద్రి అప్పన్న ఆలయ దర్శన వేళలు కుదింపు - simhadri temple timings redused

కరోనా వ్యాప్తి దృష్ట్యా సింహాచలం నరసింహస్వామి ఆలయ వేళలను అధికారులు కుదించారు. భక్తులు సహకరించి సమయపాలన పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సేవలను స్వామివారికి ఏకాంతంగానే అర్చకులు నిర్వహిస్తున్నారు.

simhachalam temple timings redused
సింహాద్రి అప్పన్న ఆలయ దర్శన వేళలు కుదింపు

By

Published : May 2, 2021, 12:34 AM IST

కొవిడ్ దృష్ట్యా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం నుంచి సింహాచలం ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం 2:30 గంటల వరకే దర్శనాలు కల్పించాలని ఆలయ ఈవో ఎం.వీ సూర్యకళ నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే భక్తులను ఆలయం లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు. స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

అర్చకులతోపాటు ఆలయ ఉద్యోగులందరినీ రాబోయే చందనోత్సవానికి సన్నద్ధం చేసేందుకు తగిన విశ్రాంతి దీని వల్ల లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కుదించినట్లు.. అందుకు భక్తుల సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆలయంలోని మొత్తం 22 మంది అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నట్లు ఈవో సూర్యకళ తెలిపారు. కరోనా పాజిటివ్ కాకపోయినప్పటికీ.. స్వల్ప అస్వస్థతతకు గురైనా.. లక్షణాలున్నా అర్చకులకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారికి కరోనా టెస్టులు నిర్వహించగా.. వాటి ఫలితాలు రావలసి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details