సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాలూరు నర్సింగరావు అనే ఉద్యోగిని... దేవాదాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. దేవస్థానం భూముల్లో మాధవధార పరిధిలోని 13 ఎకరాల్లో.. అనుమతులు లేకుండా నిర్మాణాలకు సహకరించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ అదనపుకమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్.. ఈ వ్యవహారంపై విచారణ చేశారు. అనంతరం నర్సింగరావును సస్పెండ్ చేస్తున్నట్టు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సింహాద్రి అప్పన్న ఆలయ ఏఈవో సస్పెండ్ - సింహాద్రి అప్పన్న ఆలయ ఏఈవో సస్పెండ్
దేవస్థాన భూముల్లో.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు సహకరించారన్న ఆరోపణలపై సింహాద్రి అప్పన్న ఆలయ ఏఈఓను.. దేవాదాయ శాఖ సస్పెండ్ చేసింది.

simhachalam temple aeo suspended due to corruption