ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు - సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు

ఆషాడ పౌర్ణమి పురస్కరించుకుని నిర్వహించే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు
సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు

By

Published : Jun 17, 2020, 5:08 PM IST

ఏటా విధిగా నిర్వహించే విశాఖ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఆషాడ పౌర్ణమి పురస్కరించుకుని జులై 4వ తేదీన జరగాల్సిన సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో భ్రమరాంబ ప్రకటించారు. జులై 4న గిరి ప్రదక్షిణ, 5న అప్పన్నస్వామికి నాలుగో విడత సమర్పణ జరగాల్సిఉంది.

ప్రతి ఏటా గిరి ప్రదక్షిణకు సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారు. ప్రదక్షిణ మరునాడు పౌర్ణమి రోజున సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కరోనా విస్తృత వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా గిరి ప్రదక్షిణకు భక్తులను అనుమతించలేదని ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'ఎంతో మంది సీఎంలను చూశారు.. జగన్​ ఎంత?'

ABOUT THE AUTHOR

...view details