విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో పారాయణం చేసే అర్చకుల్లో 9 మందిని విధుల నుంచి తొలగించినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఈవో భ్రమరాంబ వివరణ ఇచ్చారు. స్వామివారికి ప్రతి రోజూ పారాయణం చేసే అర్చక స్వాముల్లో 14 మందికి కమిషనర్ అనుమతి లేదని... వీరిని కొనసాగించాలా..? లేక తొలగించాలా..? అనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ కమిషనర్‌కు దస్త్రం రాశామని పేర్కొన్నారు. ఆయన అనుమతి వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని... ప్రస్తుతానికి విధుల నుంచి ఎవ్వరినీ తొలగించలేదని తెలిపారు. ఆర్జిత సేవలు తగ్గడంతో స్వామి వారికి వచ్చే ఆదాయం తగ్గిందని... అందుచేత ఆర్థిక భారం తగ్గించుకునే భాగంలోనే కమిషనర్‌కు దస్త్రం రాశామని తెలిపారు.
'ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కమిషనర్‌కు దస్త్రం' - విశాఖపట్నం తాజా వార్తలు
సింహాద్రి అప్పన్న సన్నిధిలో పారాయణం చేసే అర్చకుల్లో 9 మందిని విధుల నుంచి తొలగించారని వస్తున్న వార్తలపై ఈవో భ్రమరాంబ వివరణ ఇచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేని వారు స్వామి వారి పారాయణంలో పాల్గొంటున్నారని... వారిని కొనసాగించాలా..? లేక తొలగించాలా అనే ఉద్దేశంతో ఉన్నతాధికారికి దస్త్రం రాశామని తెలిపారు.
సింహాచలం ఈవో భ్రమరాంబ వివరణ