కరోనా రెండో దశ విజృంభణతో విశాఖ సింహాచలంలో దర్శనాలు నిలిపివేశారు. నేటి నుంచి 6 రోజులపాటు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎంవీ.సూర్యకళ తెలిపారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని పేర్కొన్నారు. అలాగే భక్తులను సింహగిరిపైకి అనుమతించబోమని తెలిపారు. దర్శనాలు లేకపోయినా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి అన్ని వైదిక కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది కొవిడ్ భారినపడటంతో ఆంక్షలు పెడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 14న చందనోత్సవానికి అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి 6 రోజులపాటు అప్పన్న దర్శనం నిలిపివేత
కరోనా దృష్ట్యా సింహాచలంలో నేటి నుంచి 6 రోజులపాటు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. సింహాచలంలో స్వామివారి ఏకాంత సేవలు యథాతథంగా జరుగుతున్నాయి. ఈ నెల 14న చందనోత్సవానికి అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అప్పన్న దర్శనం నిలిపివేత