సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి చందన దీక్షలు సింహగిరిపై శనివారం ప్రారంభం అయ్యాయి. 42 రోజుల పాటు చందన దీక్షలు జరగనున్నాయి. కరోనా కారణంగా చందన దీక్ష చేపట్టే స్వాముల ఇరుముడిని కొండపైకి అనుమతి ఇవ్వటం లేదు. దీక్షలను అధికారికంగా ప్రకటించలేదు. చందన దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి వారి పీఠంలోనే సమర్పించి స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా దేవాదాయ శాఖ సూచించింది. దీంతో సింహగిరి దిగువన భక్తులు పీఠంగా ఏర్పడి మాల వేసుకుని స్వామి భజన కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి ఏడాది దీక్ష చేపట్టే భక్తులకు దేవాదాయశాఖ వస్త్రాలను ఉచితంగా ఇచ్చేది. ఈ ఏడాది కరోనా నిబంధనలు కారణంగా భక్తులకు వస్త్రాలు ఇవ్వడంలేదని ప్రకటించింది.
సింహగిరిపై చందన దీక్షలు ప్రారంభం - విశాఖ జిల్లా వార్తలు
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందన దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలను దేవాదాయశాఖ అధికారంగా ప్రకటించలేదు. దీక్ష చేపట్టే స్వాములు ఇరుముడిని కొండపైకి తీసుకురావద్దని సింహాచలదేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఇరుముళ్లను వారి పీఠంలోనే సమర్పించి, స్వామి దర్శనం చేసుకోడానికి కొండకు రావాలని సూచించారు.
Simhachalam appana swami