ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రసాద్​ పథకానికి సింహాచలం దేవస్థానం ఎంపిక - prasad scheme news

simhacahalam temple
ప్రసాద్​ పథకానికి సింహాచలం దేవస్థానం ఎంపిక

By

Published : Jul 29, 2020, 6:06 PM IST

Updated : Jul 29, 2020, 9:15 PM IST

18:02 July 29

యాత్రికుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకానికి శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్రం సమాచారం పంపింది. ప్రసాద్ (నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) పథకంగా వ్యవహరించే ఈ పథకం ద్వారా వచ్చే నిధులను యాత్రికుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. 

ఈ పథకం కింద సింహాచలం దేవస్థానానికి రూ.53 కోట్లు నిధులు వస్తాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మొత్తాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్​ సింగ్​ పటేల్​ మంజూరు చేశారన్నారు. నిధుల కోసం లేఖ రాసిన వెంటనే స్పందించి విడుదల చేసినందుకు కేంద్ర మంత్రికి అవంతి కృతజ్ఞతలు తెలిపారు.

సంచైత గజపతి హర్షం

సింహాద్రి అప్పన్నను ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్​ సంచైత గజపతి దర్శించుకున్నారు. దేవస్థానాన్ని ప్రసాద్​ పథకానికి ఎంపిక చేసినందుకు ఆమె ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదీ చూడండి..

ఇక ఆ ప్రాజెక్టు పేరు.. వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు

Last Updated : Jul 29, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details