ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతులు - విశాఖకు చేరుకున్న శారదా పీఠాధిపతుల వార్తలు

విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ నుంచి విశాఖకు చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష నిమిత్తం మూడున్నర నెలల అనంతరం పీఠానికి వచ్చిన వారికి భక్తులు స్వాగతం పలికారు.

Shri Swaroopanandendra Saraswati
Shri Swaroopanandendra Saraswati

By

Published : Sep 13, 2020, 7:49 PM IST

విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష నిమిత్తం మూడున్నర నెలల క్రితం స్వామీజీలు రిషికేష్ వెళ్ళారు. ఈ నెల 2వ తేదీన దీక్ష ముగియడంతో ఆదివారం మధ్యాహ్నం తిరిగి విశాఖపట్నానికి చేరుకున్నారు. దాదాపు వంద రోజుల తర్వాత విశాఖకు చేరుకున్న స్వామీజీలకు పీఠం భక్తులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పీఠంలో కొలువుదీరిన దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రిషికేష్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో విగ్రహాలను శుద్ధి చేశారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేసి శమీ వృక్షం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details