విశాఖ జిల్లా చోడవరం పోలీసులు కరోనాను ఛీ కొట్టారు. ఫో ఫో.. అంటూ వెళ్లగొట్టారు. ఇదే విషయాన్ని లఘుచిత్రం రూపంలో అందరికీ తెలిసేలా చెప్పారు.స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లు లావణ్య, సుభాషిణి పాట పాడి నటించారు. ఈ పాటకు స్థానిక ఏడమ్స్ స్కూల్ సంచాలకులు బద్రీమహంతి వెంకటరావు సాహిత్యాన్ని అందించారు. దర్శకత్వ బాధ్యతనూ ఆయనే చూశారు. ఈ లఘు చిత్రాన్ని చోడవరం పోలీసు సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఈశ్వరరావు విడుదల చేశారు.
పోపో కరోనా అంటూ.. పోలీసుల లఘుచిత్రం - విశాఖలో కరోనా కేసులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అందరూ పాటించేలా పోలీసులు వివిధ పద్ధతులను పాటిస్తున్నారు. ప్రజలను చైతన్య పర్చడంలో నిమగ్నమయ్యారు. ఈ విషయంలో చోడవరం పోలీసులు చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

corona in vishaka