విశాఖ ఉత్సవ్ వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. కెరటాల ఉద్ధృతి వల్ల విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్రేక్షకులు ఒక్కసారిగా కుర్చీలపైకి ఎక్కేశారు. అప్రమత్తమైన నిర్వహకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రమాదాన్ని నివారించారు. కొంతసేపటికి విద్యుత్ పునరుద్ధరించారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి సమయంలో ఈ ఘటన జరిగింది.
విశాఖ ఉత్సవ్‌లో తప్పిన ప్రమాదం! - విశాఖ ఉత్సవ్‌లో ప్రమాదం
విశాఖ ఉత్సవ్ వేదిక వద్ద ప్రమాదం తప్పింది. సముద్ర కెరటాల ఉద్ధృతి వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే నిర్వహకుల అప్రమత్తతతో ముప్పు తప్పింది.
![విశాఖ ఉత్సవ్‌లో తప్పిన ప్రమాదం! Short circuit at Visakha Utsav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5525267-202-5525267-1577553431477.jpg)
విశాఖ ఉత్సవ్ వేదిక