Mutthamshetty Srinivasa Rao: విశాఖ జిల్లా అనంతపురం మండలం రామవరంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. రామవరానికి వెళ్లిన అవంతిని గ్రామస్థులు చుట్టుముట్టారు. గతంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. సెల్‌టవర్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి రహదారి కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదని... గుంతలతో నిత్యం సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు చుట్టుముట్టేసరికి అసహనానికి గురైన మాజీ మంత్రి వారి మీద ఎదురుదాడికి దిగారు.
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చేదు అనుభవం - అనంతపురంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
Mutthamshetty Srinivasa Rao: వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన రామవరం గ్రామంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు తీరని అవమానం జరిగింది. 2009 ఎన్నికల నుంచి పలు దఫాలుగా పదవులు చేపట్టిన ముత్తంశెట్టి తమ గ్రామానికి ఇంతవరకు ఎందుకు రాలేదని నిలదీసారు. సమస్యల పరిష్కారంలో ముఖం చాటేసిన ఎమ్మెల్యేను తమ గ్రామంలో అడుగుపెట్టనివ్వబోమని గ్రామస్థులు తెగేసి చెబుతున్నారు.
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
Last Updated : Sep 23, 2022, 3:28 PM IST