విశాఖ జిల్లాలో ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను.. గౌరవ వేతనంపై న్యాయశాఖ నియమించింది. జస్టిస్ భమిడిపాటి నాగేశ్వరరావు, చినచెలి నూతన్, కొల్లూరు భారతి, అచ్చాల సరోజినీ దేవి, దొడ్డిగార్ల రాణి రత్నకుమారి, కింతాడ మురళీ కృష్ణకు విశాఖలో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
జస్టిస్ బంటుపల్లి వెంకటేశ్వరరావును స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ క్లాస్ 2, అనకాపల్లిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడుగురూ రెండేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొంది.