Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఏమినేని అశోక్ కుమార్ అన్నవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. 2021లో వివాహమైంది. ఈనెల 15న పని మీద దిల్లీ వెళ్తున్నానని కుటుంబీకులకు వాట్సాప్‌లో సమాచారం అందించిన అశోక్ కుమార్... విశాఖ నగరానికి చేరుకున్నాడు. పెద రుషికొండలో ఓ అతిథి గృహంలో గది అద్దెకు తీసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతిథిగృహ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. గాజువాకలో ఉంటున్న మృతుడి మేనమామ నాగసుబ్బారావుకి సమాచారం అందించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఐఏఎస్ కాలేక.. జీవితంపై విరక్తితో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - Secretariat Employee Committed Suicide in Visakha
Secretariat Employee Suicide: చదివిన చదువుకు.. చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదు... ఐఏఎస్ కావాలనేది ఆ యువకుడి లక్ష్యం.. కానీ కోరిక నెరవేరలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు.. జీవితంపై విరక్తి చెందాడు.. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దిల్లీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి.. విశాఖ చేరుకున్నాడు.. ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని.. :చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని ఐఏఎస్ కావాలన్న కోరిక నెరవేరలేదని జీవితంపై విరక్తితో అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరుకు చెందిన ఇమంది అశోక్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతని భార్య రాజరాజేశ్వరి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. ఈ నెల 12న ట్రైనింగ్ నిమిత్తం సామర్లకోటకు వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి ఫోన్ చేయడం మానేశాడు. 15న దిల్లీ వెళ్లానని తమ్ముడు సురేంద్రకు తెలియజేశాడు. అనంతరం గురువారం విశాఖ రుషికొండలోని లాడ్జీలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని, కుటుంబ సభ్యులను చక్కగా చూసుకోవాలని తమ్ముడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపించాడు. సురేంద్ర వెంటనే పీఎం పాలెం పోలీసులకు తెలియజేయగా... వారు వెళ్లి చూడగా లాడ్జిలోని ఫ్యాన్ కు వేలాడుతూ అశోక్ కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
ఇదీ చదవండి :'నిర్ణయం మార్చుకోండి.. మా జిల్లా పేరు మార్చొద్దు'