ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా దౌర్జన్యాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు - Muncipal elections 2021

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ అఖిలపార్టీలతో విశాఖలో సమావేశమయ్యారు. అధికారపార్టీ చేస్తున్న దౌర్జన్యాలపై పలుపార్టీల నేతలు నిమ్మగడ్డను కలిసి ఫిర్యాదు చేశారు.

Former whip Koona Ravikumar
మాజీ విప్ కూన రవికుమార్

By

Published : Mar 2, 2021, 3:56 AM IST

విశాఖ కలెక్టరేట్​లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ అఖిల పార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డను కలిసి అధికార వైకాపా చేస్తున్న దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో రాక్షస పరిపాలన: కూన

రాష్ట్రంలో రౌడీ, రాక్షస పరిపాలన సాగుతోందని తెదేపా నేత కూన రవికుమార్‌ మండిపడ్డారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో తెదేపా బీ ఫారం ఇచ్చి నామనేషన్‌ దాఖలు చేస్తే.. మంత్రి సీదిరి అప్పలరాజు దొడ్డి దారిన అభ్యర్ధులను తీసుకువెళ్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్‌కు తెదేపా అభ్యర్ధన చేశామన్న కూన రవి.. కొత్త అభ్యర్ధులకు నామినేషన్‌కు మరళల అవకాశం ఇవ్వాలని కోరామన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా పాలనలో మంచివారు జైలుకు, రౌడీలు అసెంబ్లీకి వెళ్తున్నారు: నారాయణ

ABOUT THE AUTHOR

...view details