ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడలి లోతుల్లో ప్రయాణం.. మనసుకు దొరుకున్ ఆనందం

సముద్ర గర్భంలోకి వెళితే.. దొరికే ఆనందమే వేరు. భూమిపై దొరకని ఆనందం కడలి లోతుల్లో దొరుకుతుంది. అలాంటి అనుభూతి పొందాలనుకునేవారు చాలామంది. ఇలా సముద్రంలోకి వెళ్లి అద్భుత ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు కొంతమంది అతిథులు. వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు ఓ యువ బృందం ప్రయత్నిస్తోంది.

scuba training in vizag
scuba training in vizag

By

Published : Mar 17, 2020, 9:03 AM IST

కడలి లోతుల్లో ప్రయాణం.. మనసుకు దొరుకున్ ఆనందం

విశాఖ ఆక్వాస్పోర్ట్స్ కాంప్లెక్స్​లోకి ఎన్నడూ రాని అతిథులు వచ్చారండోయ్. వైకల్యం ఉన్నా.. ఏధైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం వారి సొంతం. వారి మనసులో ఉండే అరుదైన కోరిక తీర్చేందుకు ఓ యువ బృందం కృషి చేస్తోంది. సాగరలోతుల్లో ఉండే ఎన్నో వింతలు, విశేషాల్ని స్కూబా డైవింగ్​ ద్వారా దివ్యాంగులకు చూపించాలని తలంచింది. వారే 'ప్లాటీ పస్ ఎస్కేప్స్'​ స్టార్టప్ సంస్థకు చెందిన యువ బృందం.

స్కూబా డైవింగ్​లో నైపుణ్యం కలిగిన 'ప్లాటీ పస్ ఎస్కేప్స్​' బృందం... అమెరికాకు చెందిన హ్యాండిక్యాప్డ్ స్కూబా అసోసియేషన్​ చేయికలిపింది. ఆ దిశగా అక్కడి నుంచి వచ్చిన నిష్ణాతుడైన ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు బృంద సభ్యులు. తమ కాళ్లు తామే కట్టుకుని కాసేపు శారీరక వైకల్యం కలిగిన వారిలా భావించడం ద్వారా... నీటిలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ఎలా అనేవిషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కసరత్తును నేరుగా చూసేందుకు కొందరు దివ్యాంగులూ అక్కడికి చేరుకున్నారు. తాము నీటిలోకి దిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపైన మెళకువలను సైతం నేర్చుకుంటున్నారు.

కొద్దిరోజులుగా విభిన్న రూపాల్లో ఈ బృందం శిక్షణ తీసుకుంది. బధిరులు, అంధులు సైతం నీటిలోపలి ప్రదేశంలో కలిగే అరుదైన అనుభూతిని ఆస్వాదించవచ్చని బృంద సభ్యులు చెబుతున్నారు. అందుకు అవసరమైన ప్రత్యేకమైన పరికరాలు అన్నీ సమకూర్చుకున్న ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ... త్వరలోనే దివ్యాంగులకు అక్కడి వింతల్ని పరిచయం చేస్తామని చెబుతోంది.

ఇదీ చదవండి: చేపల చెరువులు.. కాలుష్యానికి ఆవాసాలు

ABOUT THE AUTHOR

...view details