ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సేంద్రీయ సాగుపై అవగాహన కోసం... విశాఖలో ఆర్గానిక్ రిట్రీట్ 2020 - విశాఖలో ఆర్గానిక్ రిట్రీట్ 2020

విశాఖ గాజువాకలోని సృష్టి వరల్డ్ స్కూల్, చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు.. సేంద్రీయ పద్ధతిలో సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయంలో రసాయనాలను విరివిగా వినియోగించడంతో.. పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

organic retreat 2020 in gajuwaka, organic forming awareness to school students in visakha
విశాఖలో ఆర్గానిక్ రిట్రీట్ 2020, సేంద్రీయ సాగుపై విద్యార్థులకు అవగాహన

By

Published : Mar 31, 2021, 8:27 PM IST

సేంద్రీయ సాగు గురించి తెలుసుకుంటున్న విద్యార్థులు

సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండించడంపై.. విశాఖలోని గాజువాకలో ఆర్గానిక్ రిట్రీట్-2020 పేరిట ఐదురోజుల కార్యక్రమం జరుగుతోంది. రసాయనాల ప్రమేయం లేకుండా వ్యవసాయం చేయడం మీద.. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సృష్టి వరల్డ్ స్కూల్, చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సేంద్రీయ పద్ధతిలో మొక్కలను ఎలా పెంచాలో.. వ్యవసాయ క్షేత్రం నడుపుతున్న రత్నం వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సేంద్రీయ పంటలు పండించే విధంగా అడుగు ముందుకు వేయాలని సూచించారు.

రసాయనాలు ఉపయోగించి పంటలు పండించేందుకు అలవాటు పడిన కారణంగా.. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. దేశంలో 80 శాతం కెమికల్ ఫార్మింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు ఒక్కసారిగా రాదని.. కిచెన్ ఫార్మింగ్, సేంద్రీయ పంటలు పండించడం వంటిని పిల్లల దశ నుంచే మొదలుకావాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలం పద్ధతిలో సాగుచేయడం తప్పనిసరి అని తెలిపారు. వర్మీకంపోస్ట్, కోకోపిట్​లతో సేంద్రీయ పంటలు పండించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details