ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన్​నాయుడు అరెస్టు.. అట్రాసిటీ కేసు నమోదు - visakha crime news

విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఓ యువకుడికి జరిగిన శిరోముండనం కేసులో... నటుడు, నిర్మాత నూతన్​నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం అతను కర్ణాటక పోలీసుల కస్టడీలో ఉన్నారని, త్వరలో విశాఖ తీసుకొస్తామని చెప్పారు.

sc, st atrocity case on noothan naidu
నూత్​నాయుడిపై కోసు నమోదు

By

Published : Sep 4, 2020, 5:53 PM IST

Updated : Sep 4, 2020, 6:47 PM IST

నూతన్​నాయుడు అరెస్టు.. అట్రాసిటీ కేసు నమోదు

విశాఖ జిల్లాలో శిరోముండనం కేసుకు సంబంధించి.. సినీ నటుడు, నిర్మాత నూతన్​నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇంట్లో ఐఫోన్ పోయిందన్న కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిచి నూతన్ నాయుడు కుటుంబీకులు శిరోముండనం చేయించారు. ఈ దాడి వెనక నూతన్​నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నామని సీపీ తెలిపారు. అతడిని కర్నాటకలోని ఉడిపిలో అరెస్ట్ చేశామని… ఆయన దగ్గర మూడు సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

కర్ణాటక పోలీసులు అతడిని ఓ కోర్టులో హాజరుపరిచారని.. అక్కడి నుంచి తమ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి కోరుతున్నామని వివరించారు. అలాగే... రిటైర్డ్ ఐఏఎస్ పీవి.రమేష్ పేరిట కొంతమందికి కాల్ చేసి… తన సొంత పనులు చేసుకోవాలని నూతన్​నాయుడు ప్రయత్నించాడని సీపీ తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్​తో పాటు మరో ముగ్గురు వైద్యులకు కాల్ చేసి శిరోముండనం కేసులో అరెస్టు అయిన వారిలో మధుప్రియ అనే మహిళకు ఆరోగ్యం బాలేదని ధ్రువీకరించాలని సూచించారని చెప్పారు. నూతన్​నాయుడు ప్రస్తుతం కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడని.. త్వరలోనే విశాఖపట్నం తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Sep 4, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details