ప్రజా శ్రేయస్సు కోసం రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో ఈరోజు చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. హరిద్వార్, కాశీ, రిషికేశ్ వంటి పవిత్రమైన ప్రాంతాల్లో గంగాతీరాన గత 12 ఏళ్లుగా ఈ దీక్ష చేస్తున్నట్లు తెలియజేశారు. జీవిత పర్యంతం ఈ దీక్ష గంగానదీ తీరాన చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ దీక్ష విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు కాలంగా భావిస్తున్నామన్నారు. ఈ తపోశక్తి సమాజానికి కళ్యాణ శ్రేయస్సు కావాలని భావిస్తున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.
గంగానదీ తీరంలో శారదా పీఠం ఆధ్వర్యంలో చాతుర్మాస్య దీక్ష - sarada peetham ashramam latest news
విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో రిషికేశ్‌లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. రిషికేశ్‌లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరంలో ఈ దీక్షను చేస్తామని తెలియజేశారు. జీవితాంతం ఈ దీక్ష గంగానదీ తీరాన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి