కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్నవారిగా ఓ వైపు పొగడ్తలతో పారిశుద్ధ్య కార్మికులను ముంచెత్తుతున్నా... కొన్నిచోట్ల మాత్రం వారికి కనీసం వేతనాలు దక్కక అవస్థలు పడుతున్నారు. విశాఖలో స్త్రీ ప్రస్తూతి వైద్యసేవలకు పేరొందిన ఘోష ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు.. ఐదు నెలలు నుంచి వేతనాలు ఇవ్వలేదని వాపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో పది కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి సేవలందించామని గుర్తుచేశారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన చెందారు.
సెక్యూరిటీ సిబ్బందికి సైతం
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. డాక్టర్లపై దాడులు జరగకుండా చూసే సెక్యూరిటీ సిబ్బందికి కుడా అవే కష్టాలు. ఆరు నెలల నుంచి జీతం లేక అప్పులతో కుటుంబాలు నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నారు. నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.