SADHU PARISHAT ON COWS DEATH: విశాఖ వెంకోజీ పాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో తరలించిన గోవులు చనిపోతున్న వైనంపై సాధుపరిషత్తు స్పందించింది. ఈ గోవుల సంరక్షణ చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి డిమాండ్ చేశారు.
గోశాలలో ఆవుల దీన పరిస్థితిని పరిశీలించిన ఆయన.. వాటికి కనీసం ఏం కావాలన్న అంశాలను పట్టించుకోని అధికార యంత్రాంగం పాలకుల తీరును ఎండగట్టారు. ఇప్పటికే పదికి పైగా గోవులు మృత్యువాత పడ్డాయని మిగిలినవి చనిపోకుండా.. చర్యలు తీసుకోవాలన్నారు.