ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో జరిగిన చీకటి ఒప్పందాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. పల్లా పోరాటపటిమను ప్రశంసించారు. ఉద్యమం మరింత ఉద్ధృతం కావాలన్న సబ్బం.. సీఎం కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదన్నారు.
'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటికి రావాలి. ఈ అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పల్లా శ్రీనివాస్ కు అండగా ఉంటా. ఆయన ఆశయ సాధన కోసం నేను కూడా దీక్షలో కూర్చుంటా '- సబ్బం హరి,