ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ 2 జిల్లాల్లో పిడుగులు పడొచ్చు: ఆర్టీజీఎస్​ - హెచ్చరిక

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆర్టీజీఎస్ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.

rtgs_given_precaution_to_vishaka_and_vijayanagaram_districts_about_thunders

By

Published : Jul 13, 2019, 5:25 PM IST

ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల్లో పిడుగులుపడే అవకాశం ఎక్కువగా ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. విశాఖ జిల్లా పద్మనాభం, అనందపురం, భీమునిపట్నం, కొత్తవలస... విజయనగరం జిల్లా జామి మండల పరిసరాల్లో పిడుగుపాటుకు అవకాశం ఎక్కువని ఆర్టీజీఎస్ తెలిపింది.

పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- విద్యుత్‌స్తంభాలు, సెల్‌టవర్ల కింద నిలబడకూడదు.

- పిడుగులు పడే సమయానికి నీటిలో ఉండటం మంచిది కాదు.

- ఉరుములు, మెరుపులు సమయంలో సైకిల్‌, మోటారుబైక్‌లపై ప్రయాణం చేయొద్దు.

- ఉరుములు, పిడుగులు పడే సమయానికి ఇంటిస్లాబుపై నీటి ట్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన పైపులు తాకడం మంచిదికాదు.

- లోహపు వస్తువులను చేతిలో ఉంచుకోవడం సురక్షితం కాదు.

- టీవీలు, సెల్‌ఫోన్లు వాడకుండా చూసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details