ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటంలో సీఎం జగన్​కు సాటిలేరు' - rtc employees merge in government

ముఖ్యమంత్రి జగన్​పై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ప్రశంసల జల్లు కురిపించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటంలో జగన్​కు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

rtc md krishna babu
rtc md krishna babu

By

Published : Dec 28, 2020, 3:49 PM IST

సాహసోపేత నిర్ణయాలను తీసుకోవటంలో సీఎం జగన్​కు సాటి మరొకరు లేరని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు విశాఖలో అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంస్థ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

వాల్తేర్ డిపోలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కృష్ణబాబు ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదాల బారిన పడిన వ్యక్తులను పరోక్షంగా కాపాడగలుగుతామని అన్నారు. ప్రమాదాలను నివారించే విధంగా ప్రతీ ఒక్కరూ వాహనాలు నడపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details