విశాఖలోని సత్యం కూడలి సమీపంలో రౌడీ షీటర్ వెంకటేష్ రెడ్డి అలియాస్ బండ అనే వ్యక్తిని.. గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో తలపై కొట్టి చంపారు. జయభేరి కార్ షోరూమ్ దిగువ రోడ్డులో ఘటన జరగ్గా.. హత్యానంతరం నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎంవీపీ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేఆర్ఎం కాలనీలో బాక్సర్ సంతోష్ హత్య కేసులో మృతుడు గతంలో కీలక నిందితుడిగా ఉండగా.. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య - పాత కక్షల నేపథ్యంలో విశాఖలో రౌడీ షీటర్ హత్య
బాక్సర్ సంతోష్ హత్యకేసులో గతంలో కీలక నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ వెంకటేష్ రెడ్డిని.. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. విశాఖ సత్యం కూడలి సమీపంలోని జయభేరి కార్ షోరూమ్ దిగువ రోడ్డులో జరిగిందీ ఘటన.
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య