తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వాసవి చైతన్య ఫౌండేషన్ సహా... విశాఖలోని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు రోశయ్య హాజరయ్యారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో రోశయ్య స్థానం ఎంతో ప్రత్యేకమైనదని వారు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ అభిమానించే వ్యక్తిత్వాన్ని ఆయన కలిగి ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఘనంగా మాజీ గవర్నర్ రోశయ్య జన్మదిన వేడుకలు - Rosaiah
మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వాసవి చైతన్య ఫౌండేషన్ సహా... విశాఖలోని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఘనంగా రోశయ్య జన్మదిన వేడుకలు