ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ సేవలు ప్రారంభం

విశాఖ నగరంలో రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ సేవలు అందుబాటులో వచ్చాయి. నగరంలోని మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్​ ఇన్ట్సిట్యూట్​ ఈ సేవలు అందిస్తోంది. అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా మరింత ప్రభావవంతంగా బేరియాట్రిక్ శ‌స్త్రచికిత్సల‌ు నిర్వహించవచ్చని డా. గణేష్ తెలిపారు.

Robotic bariatric surgeries
Robotic bariatric surgeries

By

Published : Dec 5, 2020, 6:49 PM IST

డాక్టర్ గొర్తి గణేష్, బేరియాట్రిక్ స‌ర్జ‌న్

రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ సేవలు విశాఖ‌లోనూ అందుబాటులోకి వ‌చ్చాయి. రోబోటిక్ సర్జరీతో అద్భుత ఫలితాలు వ‌స్తాయ‌ని రోబోటిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ వెల్లడించారు. యూఎస్, యూకే దేశాల్లో శిక్షణ పొందిన డాక్టర్ గ‌ణేష్...రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ ఇనిస్టిట్యూట్ అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా మరింత ప్రభావవంతంగా శ‌స్త్రచికిత్సల‌ు నిర్వహించవచ్చన్నారు.

విశాఖ‌ కేజీహెచ్ స‌మీపంలో ఈ సంస్థను ఆంధ్ర వైద్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.పీవీ సుధాకర్ ప్రారంభించారు. స్థూలకాయం, షుగర్ వ్యాధి అదుపులో లేనివారి పాలిట ఇది సంజీవని సుధాకర్ తెలిపారు. ఈ చికిత్సతో ఆసుపత్రి ఉండే సమయం తగ్గుతుందని, త్వరగా కోలుకుంటారన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో రోబోటిక్ సర్జరీ సేవలందిస్తున్న డాక్టర్ గణేష్, ఇక‌పై విశాఖ‌లో మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్​లో రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీలు నిర్వహించ‌నున్నారు.

బేరియాట్రిక్​ సర్జరీ అంటే?

శస్త్రచికిత్స ద్వారా బరువు తగ్గే రూపాంతర ప్రక్రియ. స్థూలకాయ దుష్పరిణామాల నివారణకు బేరియాట్రిక్ సర్జరీ మొదటిమెట్టు. వ్యాధిగా పరిగణించదగిన స్థూలకాయం ఉన్నవారి జీవితాన్ని పొడిగించడానికీ, జీవనాన్ని వీలైనంత మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి ఒక మార్గం మాత్రమే.

ఇదీ చదవండి :ఆదాయంతోపాటు విజ్ఞానం పంచుతున్న అన్నదాత

ABOUT THE AUTHOR

...view details