విశాఖలో దారిదోపిడీ ముఠా అరెస్టు.. నిందితులంతా టీనేజర్లే! - విశాఖలో దారిదోపిడీ
18:55 May 29
ఈ నెల 22న జరిగిన దారిదోపిడీ కేసులో ఏడుగురు అరెస్టు
విశాఖ జిల్లాలో దారి దోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న జిల్లాలో జరిగిన దారిదోపిడీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ గంగాధరం తెలిపారు. నిందితులంతా 16 ఏళ్ల బాలురేనన్నారు. వీరంతా అర్ధరాత్రి వేళ ద్విచక్రవాహనాలపై తిరుగుతూ.. దారిదోపిడీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనాలు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: