ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROAD ACCIDENT: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - విశాఖలో రోడ్డు ప్రమాదం

VISAKHA ROAD ACCIDENT: నూతన సంవత్సరం రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్​టీఎస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Jan 1, 2022, 10:13 AM IST

VISAAKHA ROAD ACCIDENT: విశాఖలో నూతన సంవత్సరం రోజున విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్​టీఎస్ రోడ్డులో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న 2 ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందడం అటువైపుగా వెళ్తున్న వారిని కలచివేసింది.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎటువంటి ప్రమాదాలు, రాష్ డ్రైవింగ్ జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకూ ఆ రహదారిని మూసివేశారు. ఉదయం బీఆర్​టీఎస్ రహదారిని తెరిచిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.

నిన్న రాత్రి ఎండాడ గీతం ఆస్పత్రి వద్ద డివైడర్ ఢీకొని గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. మృతులు ఇద్దరు ఆరిలోవ ప్రాంతానికి చెందగా మరో ఇద్దరు వేపగుంట ప్రాంతానికి చెంఫైన వారిగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలను ఆరిలోవ పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

Villagers Problem: వంతెన కూలిపోయింది.. ఆ ఊరి వాళ్ల బతుకులు ఆగమయ్యాయి

ABOUT THE AUTHOR

...view details