Controversy over ring nets: విశాఖలో రింగ్ వలల వివాదం.. మత్స్యకారుల మధ్య ఘర్షణ - Controversy over ring nets at vishaka
![Controversy over ring nets: విశాఖలో రింగ్ వలల వివాదం.. మత్స్యకారుల మధ్య ఘర్షణ Controversy over ring nets between fishermen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13206897-49-13206897-1632902552782.jpg)
12:46 September 29
మత్స్యకారుల మధ్య ఘర్షణ
రింగ్ వలల(Controversy over ring nets) వినియోగంపై మత్స్యకారుల మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో రెండువర్గాలు ఘర్షణకు(Controversy between fishermens over ring nets ) దిగాయి. ఎండాడ జాలరిపేట, వాసపువానిపాలెం ప్రాంతాల మత్స్యకారులు... రింగ్ వలలు విషయంపై గొడవకు దిగారు. సముద్రంలో బోట్‌లను అడ్డుకోవడం, వలలు తీసుకోవడం ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై ఒకరి పై ఒకరు దూసుకుని వచ్చారు. సమయానికి పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారిని పోలీస్ అధికారులు వారించారు. మత్స్య కార నాయకులను అదుపులోకి తీసుకుని రెండు వర్గాల వారితో సంప్రదింపులు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
VAYYERU KALUVA: వయ్యేరు కాలువకు పెరిగిన వరద.. నీటమునిగిన పలు కాలనీలు