విశాఖ కొత్త జాలరిపేటలో ఉన్న మత్స్యకారులు కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు.
బాధితులను ఆదుకునేందుకు ఎంపీ ముందుకు వచ్చారు. సుమారు 100 మత్స్యకార కుటుంబాలకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.