Retired Teacher Ramanamurthy Donated Blood 100 times at visakhapatnam: విశాఖకు చెందిన డాక్టర్ పిళ్లా రమణమూర్తి.. సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. విద్యాదానంతో పాటు రక్తదానం అవసరాన్ని చాటుతున్నారు. వందోసారి రక్తదానం చేసిన అతికొద్ది మంది వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం..రక్తదానం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉందనేది రమణమూర్తి గట్టి విశ్వాసం. ఆ విశ్వాసమే తనను రక్తదానానం చేయడానికి స్ఫూర్తినిస్తోందని చెబుతున్నారు. శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల..రక్తదానం చేయడానికి వీలవుతుందంటున్నారు.
నేటి యువతకు ఆదర్శ.. మూర్తి