ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్వాసితుల సమస్యలపై సీఎంకు విశ్రాంత ఐఏఎస్​ లేఖ - గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళనల వార్తలు

సీఎం జగన్​కు విశ్రాంత ఐఏఎస్​ అధికారి ఈఏఎస్​ శర్మ లేఖ రాశారు. గండికోట ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు.

retired ias officer  eas sarma
retired ias officer eas sarma

By

Published : Sep 11, 2020, 6:18 PM IST

సీఎం జగన్​కు విశ్రాంత ఐఏఎస్​ అధికారి ఈఏఎస్​ శర్మ లేఖ రాశారు. గండికోట జలాశయం నీటి నిల్వతో కడప జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. గండికోట జలాశయం రెండవ ఫేజు పేరుతో గ్రామాల ప్రజలను తరలించేందుకు అధికారులు బలవంతం చేస్తున్నారని వివరించారు. వారిలో చాలామందికి 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. పునరావాస చర్యలు తీసుకోకుండా భూసేకరణ చేపట్టకూడదన్న నిబంధనలను అధికారులు పాటించలేదన్నారు. ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయడం మానవ హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందన్నది గుర్తించాలన్నారు. గండికోట ముంపు గ్రామాల ప్రజల విషయంలో సీఎం జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details