తెలుగువారి సంకల్పానికి ద్రోహం జరగకుండా.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు కార్పొరేటర్ల నుంచి కాపాడుకుందామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించొద్దనే పిటిషన్‌ను తన ట్విట్టర్‌కు జతచేశారు. దానిపై ప్రతిఒక్కరూ సంతకాలు చేయాలని కోరారు.
'విశాఖ ఉక్కు పోరాటంలో ఇది మొదటి మెట్టు' - viskhapatnam latest news
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుందామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తన ట్వట్టర్ ఖాతాకు విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించొద్దనే పిటిషన్‌ను జతచేసి.. ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని కోరారు.
'విశాఖ ఉక్కు పోరాటంలో ఇది మొదటి మెట్టు'
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ ప్రజలు పోరాడి.. ఆనాడు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ఎందుకు ప్రవేటీకరించవద్దో పిటిషన్‌ను చదివి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంతకం ద్వారా ప్రైవేటీకరణను వ్యతిరేకరించాలని రామ్మోహన్నాయుడు అన్నారు. ఇది విశాఖ ఉక్కు కోసం పోరాటంలో మొదటి మెట్టుగా ఆయన పేర్కొన్నారు.