నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. తదుపరి 24 గంటలలో తుపానుగానూ పరిణమించవచ్చని పేర్కొంది. ఫలితంగా ఈనెల 25, 26న ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమందని ప్రకటించింది.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా.. ఈనెల 25, 26న రాష్ట్రంలో తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రానికి వర్ష సూచన