ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2021, 7:20 PM IST

ETV Bharat / city

'ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో నైట్ డ్యూటీ అలవెన్స్​లు కోల్పోతున్నాం'

భారతీయ రైల్వే స్టేషన్ మాస్టర్స్​కి చెల్లించే నైట్ డ్యూటీ అలవెన్స్​లను నిలిపివేయడంపై ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఐస్మా) ఆధ్వర్యంలో వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వాల్తేరులో స్టేషన్ మాస్టర్స్ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

railway masters hunger protest at waltair division
వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష

భారతీయ రైల్వే స్టేషన్ మాస్టర్స్ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేర్ డివిజన్ స్టేషన్ మాస్టర్స్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు.

నైట్ డ్యూటీ అలవెన్స్ అర్హత తిరస్కరణ, పరిమితిని నిరసిస్తూ భారత రైల్వేలోని మొత్తం 68 డివిజన్లలో ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఐస్మా) ఆధ్వర్యంలో ఈ నిరాహారదీక్ష చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో 43,600 పైగా ప్రాథమిక వేతనానికి మించిన అధికారులందరూ నైట్ డ్యూటీ అలవెన్స్ పొందే అర్హతను కోల్పోతున్నారని.. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్టేషన్ మాస్టర్స్, ఇతర రైల్వే ఉద్యోగులు కాలంతో నిమిత్తం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నామన్నారు. రాత్రి సమయంలో స్టేషన్ మాస్టర్స్, ఇతర ముఖ్యమైన ఫ్రంట్-లైన్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భారతీయ రైల్వేకు 13 పురస్కారాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details