ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శీతాకాలం వచ్చింది... రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది..!

శీతాకాలంలో పొగమంచు కారణంగా... ప్రమాదాలు జరగకుండా రైల్వేశాఖ ప్రత్యేక చర్యల తీసుకుంటోంది. ప్రత్యేకించి తెల్లవారుజామున చాలా రైళ్ల వేగాన్ని నియంత్రించాలని తూర్పు కోస్తారైల్వే నిర్ణయించింది.

railway alert for winter season
సీతాకాలంతో తూర్పు కోస్తారైల్వే అప్రమత్తం

By

Published : Nov 29, 2019, 5:02 PM IST

శీతాకాలం వచ్చింది... రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది..!

శీతాకాలంలో పొగమంచు కారణంగా... ప్రమాదాలు జరక్కుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని... లోకో పైలెట్‌లను రైల్వేశాఖ ఆదేశించింది. రాత్రిపూట, ప్రత్యేకించి తెల్లవారుజామున తూర్పు కోస్తారైల్వేలో చాలా చోట్ల పూర్తిగా పొగమంచు కప్పేస్తోంది. అధికారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని... ఈ జాగ్రత్తలను పాటించాలని ఆదేశించారు.

లెవెల్‌ క్రాసింగ్‌లు, తీవ్ర రద్దీ ఉన్న జంక్షన్‌లలో... స్టాప్‌ సిగ్నల్‌ను లోకోపైలెట్‌ గమనించే విధంగా జాగ్రత్తలు రూపొందించారు. తీవ్రమైన మంచులోనూ ఈ స్ట్రిప్‌లు లోకో పైలెట్‌లకు కనిపించే విధంగా ఉంటాయి. ఫలితంగా ప్రమాదాలు నివారించవచ్చని రైల్వేశాఖ తెలిపింది. వీటన్నింటిపై పైలెట్‌తో పాటు... గార్డులకూ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details