ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 29, 2021, 7:45 PM IST

Updated : Aug 29, 2021, 8:04 PM IST

ETV Bharat / city

PV SINDHU: అప్పన్న ఆలయానికి సింధు.. మళ్లీ పతకం సాధిస్తానని ధీమా

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత.. పీవీ సింధు.. విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. మరోసారి ఒలింపిక్స్ లో పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

PV SINDHU
PV SINDHU

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పీవీ సింధు

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చిన ఆమెను.. వచ్చేసారి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలంటూ వేద పండితులు ఆశీర్వదించారు. సింధుకు అధికారులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ప్రసాదం అందజేశారు.

ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు. దేశానికి వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించిన సింధు.. మూడోసారి సైతం మెడల్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.

Last Updated : Aug 29, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details