ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇది తీవ్రమైన నేరం.. నా నిజాయితీకి భంగం కలిగించే అంశం' - P.V Ramesh comments nuthan naidu calls

తన పేరుతో అధికారులకు నూతన్​నాయుడు ఫోన్‌ చేయడాన్ని మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేశ్‌ ఖండించారు. తన నిజాయితీకి భంగం కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పి.వి.రమేశ్‌ కోరారు.

P.V Ramesh Reaction on nuthan naidu fake call
మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేశ్‌

By

Published : Sep 5, 2020, 5:31 PM IST

నూతన్​నాయుడు ఫోన్‌కాల్‌ అంశంపై మాజీ ఐఏఎస్‌ పి.వి.రమేశ్‌ స్పందించారు. తన పేరుతో అధికారులకు నూతన్‌ నాయుడు ఫోన్‌ చేయడాన్ని ఖండించారు. నూతన్‌ నాయుడు అధికారులను బెదిరించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న పి.వి.రమేశ్‌... తన పేరు చెప్పి అధికారుల నుంచి నగదు, ఇతర సహాయాలు పొందేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన నేరమని.. తన నిజాయితీకి భంగం కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పి.వి.రమేశ్‌ కోరారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి నేరాలకు తావివ్వకూడదని పి.వి. రమేశ్‌ హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details