ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల స్థలాల పట్టాలని అంటున్నారు: పురందేశ్వరి

వైకాపా ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి... ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటోందని ఆమె ఆరోపించారు.

పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల పట్టాలని చెప్పుకుంటున్నారు
పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల పట్టాలని చెప్పుకుంటున్నారు

By

Published : Dec 26, 2020, 8:09 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. తమకు అందిన సమాచారం మేరకు ఇళ్ల పట్టాల వితరణ జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా..పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సంకోచిస్తున్నారని తెలిపారు.

వైకాపా ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. రాజధానుల ప్రకటనతో నగరాలు అభివృద్ధి చెందవని ఆమె వ్యాఖ్యనించారు. అన్ని రంగాలకు అండగా నిలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

పురందేశ్వరిని కలిసిన ఐటీ ప్రతినిధులు

ఐటీ ప్రతినిధులతో పురందేశ్వరి

పలువురు ఐటీ సంస్థల ప్రతినిధులు పురందేశ్వరిని కలిసి తమ సమస్యలను వివరించారు.ఎస్​టీపీఐ ఇంక్యుబేషన్ కేంద్రం, ఐబీపీఎస్ స్కీం, బ్యాండ్విడ్త్ ఛార్జీల తగ్గింపు అంశాలను వినతి పత్రం ద్వారా ఆమెకు తెలియజేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​తో తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలని కోరారు.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

ABOUT THE AUTHOR

...view details