విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం....మెదడుకు మేతపెట్టే పుస్తకాలతోనే కాక మనసును ఉల్లాసపరిచే పర్యావరణహిత వాతావరణంతో ఆకట్టుకుంటోంది. చిన్నారుల్ని గ్రంథాలయం వైపు అడుగులు వేయించటమే లక్ష్యంగా గోడలకు పచ్చని చెట్లు, జంతువులతో నిండిన బొమ్మలు అతికించారు. నేలపై పచ్చని బయళ్ల మాదిరిగా గ్రీన్‌మ్యాట్ వేశారు. ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు ఊయళ్లు ఏర్పాటు చేశారు. పిల్లలకోసం మియావాకి పేరిట రూపొందించిన ప్రత్యేక విభాగం....పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుతోంది.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రూపు-1, గ్రూపు-2, ఇతర పరీక్షలకు అవసరమైన పుస్తకాల్ని సబ్జెక్టులు వారీగా విడివిడిగా రీడింగ్ రూమ్‌లో అందుబాటులో ఉంచారు. అన్ని రకాల వసతులతో అత్యంత ప్రశాంత వాతావరణంలో నిరుద్యోగ యువత చదువుకునేలా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు..