ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: ఆళ్ల నాని - Visakha News

విమ్స్​లో పలు విభాగాల పనితీరును మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాసరావు పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆక్సిజన్ స‌ర‌ఫరా, వైద్య స‌దుపాయాలు, చికిత్స తీరు, వైద్యులు, సిబ్బంది అందుబాటు, రోగుల బంధువులకు స‌మాచారం ఇస్తున్న తీరుపై మంత్రులు స‌మీక్షించారు.

Alla Nani Visit VIMS
Alla Nani Visit VIMS

By

Published : May 15, 2021, 4:02 PM IST

విశాఖ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్) ప‌నితీరుపై ఉపముఖ్య‌మంత్రి ఆళ్ల‌ నాని.. మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావుతో క‌ల‌సి స‌మీక్షించారు. విమ్స్​లో వివిధ విభాగాల్లో స‌దుపాయాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆక్సిజన్ స‌ర‌ఫరా, వైద్య స‌దుపాయాలు, చికిత్స తీరు, వైద్యులు, సిబ్బంది అందుబాటు, రోగుల బంధువులకు స‌మాచారం ఇస్తున్న తీరుపై మంత్రులు స‌మీక్షించారు. మెరుగైన వైద్యసేవ‌లు అందే విధంగా అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తుల‌ు, వాటివ‌ల్ల వ‌స్తున్న ఫ‌లితాల‌ను ఉన్నతాధికారులు మంత్రులకు వివ‌రించారు. మందుల కొర‌త లేద‌ని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details